రీమా సాహిత్య పంపిణీదారులు 30+ సంవత్సరాల చరిత్ర

మేము ఎలా ప్రారంభించమే తెలుసుకోండి మరియు మేము మా ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ ప్రయత్నాలు ఎలా విస్తరించనో వాటి గురించి చదువువచ్చును

1980వ దశాబ్దపు మధ్యకాలంనుండి రీమా ఈ ఉచిత సాహిత్య పంపిణీ చేయుచూ ఉన్నది. మేము బైబిళ్లను, ఆత్మ సంబంధమైన పుస్తకాలను, రష్యా భాషలో గతములోనున్న సోవియట్ యూనియన్ యొక్క దేశాలకు పంపిణీ చేయుటకు ప్రారంభించితిమి. కోరినవారందరికి తపాలా ద్వారా పంపిణీ చేయుట మా ప్రాథమిక సాధనముగా ఉండేది, అయితే దేవుని వాక్యము అనేక స్థలములకు వ్యాపించుటకుగాను ఇతర గ్రూపులతో కూడ సహకరించితిమి.

క్రొత్త రష్యాభాషలో విస్తారమైన ఫుట్ నోట్స్ మరియు స్టడీ మెటీరియల్ ను కలిగిన క్రొత్త నిబంధ నను అధిక మొత్తంలో పంపిణీ చేయుటకు రష్యా భాషలో చేసిన క్రుషి 1999లో పరాకాష్టకు చేరుకున్నది.

2001లో ఇతర భాషలలోనికి, దేశములలోనికి ఉచితమైన ఆత్మీయ సాహిత్యమును తేవలసిన అవసరతనుగూర్చి ఆలోచించుటకు రీమా మొదలుపెట్టెను, తత్ఫలితముగా ఈ భూమ్మీద ప్రధానమైన ఇతర భాగాలను చేర్చుకొనుటకు ఇది క్రమంగా విస్తరించినది. తొలిప్రయత్నంగా మేము పది భాషలను అదనముగా చేర్చుకొని, పంపిణీ కొరకు ప్రమాణము గల పుస్తకాల సెట్ ను సిద్ధపర్చితిమి.


2006లో, మధ్య-తూర్పు మరియు ఆసియాలకు ప్రాముఖ్యమైన మరెన్నో భాషలకొరకు రీమా ప్రణాళిక వేసింది.

గత 20 సంవత్సరములలో క్రైస్తవ సాహిత్యము యొక్క లక్షలాది పుస్తకాలు బయటికి వెళ్ళెను – ఉచితంగానే.

Share with others