ఒక బైబిలు స్టడీ గైడ్ గా మా పుస్తకములను వినియోగించుకొనుడి

మీరు బైబిలును చదువుటలో మా పుస్తకములు సహాయపడగలవు తద్వారా ముఖ్యమైన సత్యములపై మీరు దృష్టి కేంద్రీకరించవచ్చు. మీ అనుదిన పఠనమును మెరుగుపరచుకొనుటకు ఉపదేశమును పొందుకొనుము.

మా పుస్తకాలు సాధారణంగా మరియు నిదానంగా చదువుకోవచ్చు. అయితే అవి చాల నిర్దిష్టమైన రీతులలో అనగా బైబిల్‌ను చదువుటకు గైడ్‌గా లేదా క్రైస్తవ అనుభవముపైనున్న పాఠాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు.

మా పుస్తకాలు, ప్రాథమిక అంశములనుండి మధ్యస్థ అంశములకు మరియు మధ్యస్థ అంశముల నుండి వృద్ధిచెందిన అంశములకు పురోగమించును. మీ బైబిల్ పఠనముకు గైడ్‌గా మా పుస్తకాలను మీరు ఉపయోగించుకోగలరు.
  • క్రైస్తవ విశ్వాసము మరియు క్రైస్తవ జీవితము యొక్క నియమాల గుండా మిమ్మల్ని నడిపించునట్లు మూడు-భాగాలు గల సంపుటితో ప్రారంభించుము, కావున క్రైస్తవునిగా ఉండుటను మీరు నేర్చుకోగలరు.
  • ద్వితీయోపదేశకాండ గ్రంథముకు చెందిన నిర్దేశించబడిన వ్యాఖ్యానములో పాత నిబంధనయందు క్రీస్తును గూర్చిన గురుతులను, సాదృశ్యములను మరియు రేఖాచిత్రములను అధ్యాయనము చేయుడి.
  • బైబిల్ యొక్క వ్యాఖ్యానము ద్వారా బైబిల్‌ను మరియు బైబిల్‌లోనున్న ప్రధానమైన కేంద్రియ అంశములను అర్ధం చేసుకోండి. బైబిల్ నుండి మరియు దేవుని జీవితము మరియు క్రైస్తవ అనుభవము వైపుకు వివరణాత్మకంగా, అనగా లోతుగా చూచుట ద్వారా దేవుని జీవితమును గూర్చి నేర్చుకొనుడి.
  • ఆదికాండము నుండి ప్రకటన వరకు బైబిల్ అంతటిలోనున్న సంఘమును గూర్చిన సమగ్రమైన పరిశోధనలో పాల్గొనండి.

మా పుస్తకములను ఉపయోగిస్తున్న బైబిల్ అధ్యయన సాధనములు


ఇతరులతో పంచుకొనండి