ఉపయోగానికి సంబంధించిన నిబంధనలు

రీమా సాహిత్య పంపిణీదార్ల వెబ్¬సైట్¬కి స్వాగతం. మీరు  ఈ సైట్¬ని ఉపయోగించడం ద్వారా క్రింది షరతులకు లోబడటానికి సమ్మతిస్తున్నారు. ఈ షరతుల విషయమై మీకేమైనా ప్రశ్నలుంటే, పరిచయాల పేజీలోని జాబితాలోనున్న మా అడ్రసుకి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం.

అంతరాంశాలు
ఈ వెబ్¬సైట్¬లోని పేజీల అంతరాంశాలు మీ సాధారణ సమాచారం, ఉపయోగం కోసం మాత్రమే. మీకు తెలియపర్చకుండా మార్చడానికి అది లోబడి ఉంది. ఏదైనా ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఈ వెబ్¬సైట్¬లోని కచ్చితత్వం, సమయానుకూలత, ప్రదర్శన, సంపూర్ణత లేదా కనుగొన్న అంశాలు, సమాచారం సరిపోవుట మున్నగువాటికి మేము గానీ మరొకరు గానీ ఎలాంటి హామీ లేక పూచీని ఇవ్వడం జరగదు. అట్టి విషయాలు లేదా సమాచారంలో గానీ సరికానివి లేదా తప్పులేవైనా ఉండొచ్చు, అట్టి సరికానివాటికి మరియు తప్పులకు చట్టరీత్యా మేం బాద్యులం కాదని మీరు గమనించగలరు.

కూర్పు

ఆర్డర్లు మరియు ప్రైవసీ
ప్రైవసీ షరతులన్నీ ప్రైవసీ స్టేట్¬మెంట్¬లో పెట్టబడి ప్రత్యేకంగా పోస్ట్ చేయబడును. క్లుప్తంగా చెప్పాలంటే ఉచిత సాహిత్యం కోరే ప్రక్రియకు మరియు అవి సక్రమంగా చేరడానికి మాత్రమే మీ వ్యక్తిగత సమాచారం అవసరం. సరైన మెయిలింగ్ సమాచారం, లభ్యతపై ఆధారపడి ఆర్డర్లు పంపబడును. కొన్ని ప్రత్యేక కేసులలో ధర, చట్టనిషేధాలు, అంతర్జాతీయ వివాదాలు, సుంకపు చట్టాలు, ఇతర కారణాలను బట్టి ఆర్డర్లు పంపలేకపోవచ్చును. ఈ కారకాలు ఎలాంటి నోటీసు లేకుండా మార్చడానికి లోబడి ఉంటాయి.

కాపీరైట్
ఈ వెబ్¬సైట్¬లోని అంతరాంశాల లైసెన్స్ గలవారు లేదా స్వంతదార్లు రీమా సాహిత్య పంపిణీదారులే. ఈ అంశాలలో డిజైన్, కూర్పు, లోగోలతో కూడిన గ్రాఫిక్స్, రూపం, ప్రశంసావాక్కులన్నీ ఇమిడియున్నాయి. నిబంధనాలవళిని అనుసరించి తప్ప దీనిలోనివేవీ కూడా పునర్ముద్రించకూడదు.  ఈ వెబ్¬సైట్¬ను అనధికారంగా ఉపయోగించినా, పాడుచేసినా నేరారోపణ, దురాక్రమణ చేసినట్టు వాదించుటకు కారణమగును.

జవాబుదారీ (బాధ్యత)
ఈ వెబ్¬సైట్¬లోని మీ యొక్క ఏదైనా సమాచారం లేదా విషయాలకు పూర్తిగా మీదే పూచీ. దీనికి రీమా సాహిత్య పంపిణీదారులు లేదా వారి ప్రతినిధులు జవాబుదారులు కారు. మీ ప్రత్యేక అవసరాలు తీర్చడానికి ఈ వెబ్¬సైట్ ద్వారా లభించే ఏదైనా సమాచారం, సేవలు లేదా ఉత్పత్తులు భద్రపర్చుకొనే బాధ్యత మీదే. సమయానుకూలంగా ఈ వెబ్¬సైట్¬కి ఇతర వెబ్¬సైట్ల లింకులు కూడా కలుపబడును. అధిక సమాచారం ఇవ్వడానికి ఈ లింకులు మీకు సౌకర్యవంతంగా ఉండును. లింక్ వెబ్¬సైట్లలోని అంతరాంశాలకు-మాకు ఎలాంటి బాధ్యత లేదు. మీరు ఈ వెబ్¬సైట్¬ను ఉపయోగించుటచేత ఎదురయ్యే సమస్యలకు వాషింగ్టన్ రాష్ట్ర మరియు అమెరికా సంయుక్ట రాష్ట్రాల చట్టాలకి లోబడి ఉండవలెను.