రీమా ఉచితముగా క్రైస్తవ పుస్తకాలను పంపిణీ చేయు లాభారహిత స్వచ్ఛంద పంపిణీదారులము

మేము ఒక లాభారహిత స్వచ్ఛంద పంపిణీదారులముగా ఏమి చేయుచున్నమో , మా చర్యల చరిత్రను గురించి మరియు ఎలా మీరు పాల్గొనవచ్చును వాటిని గురించి తెలుసుకోండి.


రీమా సాహిత్య పంపిణీదారులు భూమియందంతటనున్న ఒక గుంపు విశ్వాసులు, వీరంతా ఒకే ఒక్క పనిలో నిమగ్నమైయున్నారు. అదేమనగా, అత్యున్నతమైన ప్రామాణము గల క్రైస్తవ సాహిత్యమును చురుకుగా పంచిపెట్టుట. దాదాపు 40 దేశాలలో 10కంటే ఎక్కువ భాషలలో మేము ఒక సరళమైన సూత్రము ప్రకారము పనిచేయుచున్నాము. మా సాహిత్యమంతయూ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడును.

బైబిలును అర్థము చేసుకోవడానికి మరియు మా అనుదిన జీవితంలో క్రీస్తును ఎరగడానికి, అనుభవించడానికి ఎంతగానో సహాయపడిన పుస్తకాలనే మేము పంపిణీ చేయుచున్నాము. మరిముఖ్యముగా, తమ గ్రంథకర్తలచే వ్రాయబడిన ప్రాముఖ్యమైన కొన్ని పుస్తకాలను పంపిణీ చేయుటకు మేము లివింగ్ స్ట్రీమ్ మినిస్ట్రీ వారితో సన్నిహితముగా పనిచేయుచున్నాము. 

మేము ఎలాంటి లాభములేని స్వచ్ఛంద సేవ చేయువారము. మా పంపిణీ ప్రపంచమంతటానున్న విశ్వాసులు, సంఘములు ఇచ్చే విరాళముల చేతనే సాధ్యపడుచున్నది. దేవునిని ఒక లోతైన మరియు సంత్రుప్తికరమైనరీతిలో ఎరగాలనేవారందరికీ స్వేచ్ఛగా, విశాలంగా సరఫరా చేసే సాధనాలుగానుండునట్లు వారు మమ్ములను నమ్మి మాకప్పగించెను.

మా విశ్వాసము

ప్రజలు తరచుగా మా నమ్మకాలను గురించి అడుగుతారు ఇదే మా విశ్వాసం యొక్క ప్రకటన. ఈ నమ్మకాలు పాటిస్తూ మా పుస్తకాలను స్వీకరించడానికి షరతుగా లేవు మా పుస్తకాలు ఏ నమ్మకాలు కలిగిన ఎవరికైనా స్వేచ్ఛగా అందుబాటులో ఉన్నాయి.

విశ్వాసులందరికి పంచి ఇచ్చిన ఒకే విశ్వాసమును రీమాలోనున్న మేమును చేపట్టుచున్నాము. ఈ విశ్వాసములోనున్న విషయాలు క్రొత్త నిబంధనలో ఒకసారే అనుగ్రహించబడెను. ప్రత్యేకంగా చెప్పాలంటే, ఈ క్రొత్త నిబంధన విశ్వాసము ఈ క్రింది విషయాలతో సమకూర్చబడినది; అవి మేము నమ్ముచున్న బైబిలు, దేవుడు, క్రీస్తు, రక్షణ, నిత్యత్వమునకు సంబంధించినవి:

  • బైబిలు సంపూర్ణమైన దైవిక ప్రత్యక్షత, ప్రతి మాటా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చేత ప్రేరేపించబడినది. 
  • దేవుడు అద్వితీయమైనవాడు, నిత్యత్వముగా ఒక్కడై ఉన్నాడు, అయినను నిత్యత్వముగా త్రియేకునిగా ఉన్నాడు. తండ్రి, కుమార, ఆత్మగా ఉన్న ఈ ముగ్గురు ప్రత్యేకంగా ఉన్నప్పటికీ వారు వేరుచేయబడనివారు.
  • దేవుడు క్రీస్తునందు ఒక యథార్థమైన, సంపూర్ణమైన మానవునిగా యేసు అనే పేరుతో నరావతార మెత్తెను. ఆయన సిలువపై చంపబడెను, మన విమోచనార్థం త్యాగపూరితమైన మరణాన్ని అనుభ వించెను. మూడో రోజున ఆయన చనిపోయినవారిలో నుండి లేచెను. ఆయన మహిమపర్చబడిన దేహంతో పునరుత్థానుడాయెను. మరియు దేవుని కుడిపార్శ్వానికి ఆరోహణుడై అందరికీ ప్రభువుగా చేయబడెను.
  • మానవుడు పాపం చేసెను. పాపి అయ్యెను. అట్టివానిగా అతడు దేవుని తీర్పు కిందికి వచ్చెను. అయితే క్రీస్తు యొక్క త్యాగపూరిత మరణం ద్వారా మానవుడు పాపం నుంచి మరియు దేవుని తీర్పు నుంచి రక్షణ పొందుకొనుటకు గల మార్గము తెరవబడెను. ఏ వ్యక్తి అయినా దేవుని వైపు తిరిగి మారు మనస్సు పొంది ప్రభువైన యేసుక్రీస్తులోనికి విశ్వాసం ఉంచినప్పుడు అతడు నిత్యమైన రక్షణ, పాప క్షమాపణ పొంది, దేవుని ఎదుట నీతిమంతునిగా తీర్చబడి, దేవునితో సమాధానము కూడా పొందుకొనును. దీని ఆధారముగా రక్షించబడిన ఆ వ్యక్తి దైవిక జీవం, స్వభావం పొందుకొనును. అది అతడిని దేవుని బిడ్డగాను, క్రీస్తు దేహపు అవయవముగాను చేయును. ఆ దేహంనందు విశ్వాసులందరూ ఎదుగుదురు మరియు పరికత్వ పొందున్నట్లు కలిపి నిర్మించబడుదురు.
  • ఆయన విశ్వాసులను తన వద్దకు తీసుకొనిపోవుటకు క్రీస్తు మరలా ఈ భూమ్మీదికి వచ్చును. నిత్యత్వమునందు మనం నూతన యెరూషలేము నందు దేవునితో నివసించెదము. అది ఆయన ఎన్నుకొనిన వారికిచ్చిన దేవుని రక్షణకు అంతిమ పరిణితిగా ఉండును.

రీమాలోనున్న మా లక్ష్యమేమనగా క్రైస్తవ రచనలయొక్క అద్వితీయమైన కలెక్షన్ ను ఉచితంగా సరఫరా చేయుటయే. అది ఈ క్రొత్త నిబంధన విశ్వాసమునకు సంబంధించిన చదువరుల అవగా హనను, అనుభవమును వృద్ధిచెందించునని మేము నమ్ముచున్నాము. విశ్వాసులు ఆయన విమోచన ద్వారా క్రీస్తునందున్న నిత్య రక్షణను ఆస్వాదించుట మాత్రమే గాక ఆయన జీవమునందున్న అనుదిన రక్షణను కూడ ఆస్వాదించును. అది బైబిలునుండి వచ్చే ఆత్మీయ ఆహారముచేతనే ఆచరణీయముగా అనుభవించబడుతుంది. ఇది మా అనుభవంగా ఉన్నది, ఇది మీ అనుభవంగా కూడ ఉంటుందని ఆశిస్తున్నాం.

Share with others