మా పుస్తకాలు బైబిల్‌ను అర్థం చేసుకునేలా మీకు సహాయపడును

బైబిల్‌ను గూర్చి మీ అవగాహనను పెంచండి మరియు దేవుని వాక్యమ చేత పోషించబడండి.

మా పుస్తకాలను ఒక వరుస క్రమములో చదువుట చేత మీరు బైబిల్‌ను గూర్చి మరియు ప్రాముఖ్యమైన అంశాలను గూర్చితెలుసుకుంటారు. మా పుస్తకాలను చదువుట బైబిల్‌ను చదువుటకు అదనమైయున్నది మరియు ప్రాథమిక క్రైస్తవ విశ్వాసముకు చెందిన అంశములన్నిటికి సంబంధించిన మీ అవగాహనను మెరుగుపరచగలవు. మీ క్రైస్తవ జీవితముకు మా పుస్తకాలు మంచి పునాదిని వేయుటకు సహాయపడును.

బైబిల్‌లోనున్న అనేకమైన కేంద్రీయ అంశాలు అవేవనగా క్రీస్తు, సంఘము, దేవుని జీవము మరియు నేటి ప్రభువు పని అట్టివి వివరణాత్మకంగా విశదీకరించబడెను. మీరు బైబిల్‌ను అర్థం చేసుకోగలుగుటకు సహాయపడునట్లు బైబిల్ నుండైన కథలు, ఉపమానములు, గురుతులు, సాదృశ్యములు మరియు రేఖాచిత్రములకు సంబంధించిన అనేక వ్యాఖ్యానములు ఉన్నాయి.

ఆత్మసంబంధమైన ఎదుగుదల కొరకు బైబిల్‌ను చదవండి

మనము బైబిల్‌ను చదువుటకు వచ్చినప్పుడు, బైబిల్ అర్థం చేసుకొనుట లేదా దాని నుండి జ్ఞానమును సంపాదించుకొనుట మాత్రమే మన అవసరత కాదు. దేవుని వాక్యము చేత మనము పోషించబడాలి మరియు ఆత్మసంబంధముగా సరఫరా చేయబడాలి-ఇదే మన ప్రాథమిక అవసరత. మనకింకను బైబిల్‌కు చెందిన సరైన అవగాహన అవసరము మరియు మా పుస్తకాలు దీనికి సహాయపడును, కాని మనము దీనికి మించి బైబిల్‌లోనున్న ఆత్మను, జీవమును మరియు ఆహారమును తాకుటను కూడ నేర్చుకోవాలి.

బైబిల్ పాలును, ఆహారమును, తేనెకంటె మధురమైనదియును అయ్యున్నదని మరియు మనము వాక్యమును తినవలెనని బైబిల్ చెప్పుచున్నది. దీనిని మనము ఎలాగు చేయగలము? ఇది భౌతికంగా తినుట కాదు కాని ఆత్మసంబంధముగా తినుట, దీని ద్వారా మనము పరిపక్వతకై ఎదుగగలము.

వాక్యముకు గ్రీకులో రెండు పదాలు ఉన్నాయి-లోగోస్ మరియు రీమా. లోగోస్ అనునది వ్రాయబడిన, స్థిరమైన మాట. రీమా అన్నది తక్షణ, ప్రస్తుతము చెప్పబడిన మాట. బైబిల్‌లోనున్న మాటలు ఆత్మను మరియు జీవమును కలిగియున్నవి మరియు రీమా మాటగా అవి మనకు ఆహారముగా ఉండగలవు. వాక్యముకు చెందిన ఆత్మసంబంధమైన అంతరాంశములను పొందుకొనుటకుగాను బైబిల్‌లో వ్రాయబడిన మాటలను లోనికి తీసుకొని, దేవుడు మనతో మాట్లాడే తక్షణపు మాటలుగా వాటిని మార్చుటకు గల విధానమును మనము నేర్చుకోవాలి. మన పుస్తకాలు దీనిని చేయుటకు గల మార్గమును కలిగియున్నవి మరియు మీరు బైబిల్‌ను చదివినప్పుడు అవి మీ అనుభవాన్ని వృద్ధి చేయగలవు. ఈ పుస్తకముల ద్వారా మేము అధికముగా సహాయము పొందుకొంటిమి మరియు ఈ కారణంగానే మమ్మల్ని మేము రీమా సాహిత్య పంపిణీదారులు అని పిలుచుకొనుటకు నిర్ణయించుకొంటిమి.


మా పుస్తకములను ఉపయోగిస్తున్న బైబిల్ అధ్యయన సాధనములు


ఇతరులతో పంచుకొనండి