విట్‌నెస్ లీ ని గూర్చి

విట్‌నెస్ లీ ని గూర్చి, తన పరిచర్యను గూర్చి, రచనలను గూర్చి మరియు నమ్మకములను గూర్చి తెలుసుకోండి.

విట్‌నెస్ లీ గారు, వాచ్‌మెన్ నీ గారి యొక్క అత్యంత సన్నిహితమైన, అత్యంత నమ్మకమైన జతపనివాడు. 1925లో తన 19వ యేట అతడు శక్తివంతమైన ఆత్మీయ పునర్జన్మను అనుభవించెను మరియు సజీవమైన దేవుని సేవించుటకుగాను తన్నుతానే ఆయనకు సమర్పించుకొనెను. ఆ సమయమునుండి అతడు బైబిలును అత్యధికంగా చదువుటకు ఆరంభించెను. తన క్రైస్తవ జీవితములో మొదటి ఏడు సంవత్సరాల కాలముపాటు అతడు ప్లైమౌత్ బ్రదరన్ వారి చేత బహుగా ప్రభావితము చేయబడెను. తరువాత అతడు వాచ్‌మెన్ నీ గారిని కలుసుకొనెను. తరువాత 17 సంవత్సరాలు అనగా 1949 వరకు అతడు చైనాలో సోదరుడు నీ గారికి ఒక జతపనివాడుగా ఉండెను. రెండవ ప్రపంచ యుద్ధ కాలములో చైనా జపాను చేత ఆక్రమించబడినప్పుడు అతడు జపానీయుల చేత చెరసాలలో వేయబడెను మరియు ప్రభువునకు చేయు తన నమ్మకమైన సేవ కొరకు శ్రమపడెను. ఈ ఇద్దరు దేవుని సేవకుల యొక్క పరిచర్య మరియు పని చైనాలో క్రైస్తవుల మధ్య ఒక గొప్ప ఉజ్జీవమును తీసుకువచ్చెను. దాని ఫలితముగా సువార్త దేశమంతటా వ్యాపించెను మరియు వందల కొలదీ సంఘములు కట్టబడెను

1949లో వాచ్‌మెన్ నీ గారు చైనాలో ప్రభుని సేవిస్తున్న తన జతపనివారినందరిని కూడిరమ్మని పిలిచెను మరియు చైనా మధ్య భాగము బయటనున్న తైవాన్ అనే ద్వీపములో తన పరిచర్యను కొనసాగించమని విట్‌నెస్ లీ గారికి ఆజ్ఞాపించెను. ఆ తదుపరి సంవత్సరముల కాలములో దేవుని ఆశీర్వాదము వలన తైవాన్‌లో మరియు ఆసియా మధ్య ప్రాచ్యములో వందకంటే పైగా సంఘములు స్థాపించబడెను

1960 ప్రారంభములో విట్‌నెస్ లీ గారు అమెరికా దేశమునకు వెళ్లుటకు ప్రభువు చేత నడిపించబడెను. అక్కడ అతడు 35 సంవత్సరాలకు పైగా ప్రభువు బిడ్డల ప్రయోజనార్థము పరిచర్య చేసెను మరియు పని చేసెను. అతడు కాలిఫోర్నియాలో ఏనహ్యమ్ అనే పట్టణమునందు నివసించెను. 1974 నుండి 1997 జూన్‌లో ప్రభువుతో నుండుటకు వెళ్లేవరకు అచ్చటనే ఉండెను. అనేక సంవత్సరాలు అమెరికాలో తాను చేసిన పని ద్వారా అతడు 300 పైగా పుస్తకములను ప్రచురించెను

విట్‌నెస్ లీ గారి యొక్క పరిచర్య క్రీస్తు యొక్క శోధింపశక్యముగాని ఐశ్వర్యములను అనుభవించవలెనని మరియు వాటిని గూర్చిన లోతైన జ్ఞానము కావాలని కోరుకొనే అన్వేషకులైన క్రైస్తవులకు సహాయకరముగా ఉన్నది. లేఖనములన్నిటిలోనున్న దైవిక ప్రత్యక్షతను తెరచుట వలన సోదరుడు లీ గారి పరిచర్య సర్వములో సర్వమును నింపుచున్నవాని సంపూర్ణతగానున్న ఆయన దేహమైన సంఘము నిర్మించబడుట కొరకైన క్రీస్తును ఎరుగడం అన్న దానిని బయలుపరచును. విశ్వాసులందరు, క్రీస్తు దేహము నిర్మించబడుట అనే ఈ పరిచర్యలో పాలుపొందవలెను. తద్వారా ఈ దేహము ప్రేమయందు తననుతాను నిర్మించుకొనును. ఈ నిర్మాణమును సంపూర్తి చేయుట వలన మాత్రమే ప్రభువు ఉద్దేశము నెరవేర్చబడగలదు మరియు ఆయన హృదయము తృప్తినొందగలదు

వాచ్‌మెన్ నీ గారి మరియు విట్‌నెస్ లీ గారి ప్రధానమైన విశ్వాసములకు చెందిన సంక్షిప్తమైన వివరణ ఈ క్రింద పేర్కొనబడెను:

  • పరిశుద్ధ బైబిల్ సంపూర్ణమైన దైవిక ప్రత్యక్షత, లోప రహితమైనది, దేవుడు ఊదినది, ప్రతి అక్షరము పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినది.
  • దేవుడు ఒకే ఒక త్రియేక దేవుడు-తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు-సమానముగా సహాస్థిత్వమును కలిగియున్నారు మరియు నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు పరస్పర సహాంతర్గతులైయున్నారు. దేవుని కుమారుడు అనగా సాక్షాత్తు దేవుడే, ఆయన మన విమోచకుడు మరియు రక్షకుడైయుండునట్లు యేసు అనే నామములో ఒక మానవునిగా నరావతారుడయ్యెను, కన్యకయైన మరియకు జన్మించెను.
  • యేసు నిజమైన మానవుడు. తండ్రియైన దేవుని, మానవులకు బయలుపరచుటకు ముప్పై మూడున్నర సంవత్సరములు ఈ భూమిపై జీవించెను.
  • యేసు, అనగా దేవుని చేత తన పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన క్రీస్తు, మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించి మన విమోచనము నెరవేర్చుటకొరకు తన రక్తమును చిందించెను.
  • యేసు క్రీస్తు మూడు దినములు సమాధిలో ఉన్న తరువాత మృతులలో నుండి లేచెను మరియు నలభై దినముల తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణుడయ్యెను. దేవుడు ఆయనను అందరికి ప్రభువుగా చేసెను.
  • తన ఆరోహణము తరువాత తాను ఏర్పరచుకొనిన వారందరు ఒక్క దేహముగా ఉండుటకు బాప్తిస్మమివ్వడానికి దేవుని ఆత్మను కుమ్మరించెను. నేడు ఈ ఆత్మ పాపులను ఒప్పింపజేయుటకు, దైవిక జీవమును వారిలోనికి చొప్పించుట వలన దేవుడేర్పరచుకొనిన ప్రజలను పునర్జన్మింపజేయుటకు, తమ జీవపు ఎదుగుదల కొరకు క్రీస్తు యొక్క విశ్వాసులలో నివసించుటకు మరియు ఆయన సంపూర్ణ వ్యక్తత కొరకు క్రీస్తు దేహము నిర్మించబడుటకు ఈ భూమిపై చలించుచున్నాడు.
  • తన విశ్వాసులను కొనిపోవుటకు, లోకమునకు తీర్పు తీర్చుటకు, భూమి యొక్క సొత్తును తీసుకొనుటకు మరియు ఆయన నిత్య రాజ్యమును స్థాపించుటకు ఈ యుగపు అంతమందు క్రీస్తు తిరిగి వచ్చును.
  • జయించు పరిశుద్ధులు వెయ్యేండ్ల రాజ్యములో క్రీస్తుతో పాటు యేలుదురు మరియు క్రీస్తునందలి విశ్వాసులందరు నిత్యత్వమంతా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నూతన యెరూషలేమునందు దైవిక ఆశీర్వాదములో పాలు పుచ్చుకొందురు.

మా ఉచిత క్రైస్తవ పుస్తకములు

పుస్తక రూపములో లేదా ముద్రణ రూపములో లభ్యము

బైబిలును తెలుసుకొనుటకు, క్రీస్తును గూర్చి నేర్చుకొనుటకు మా పుస్తకములు సహాయపడగలవు, మరియు మీ క్రైస్తవ జీవితముకు ఆచరణీయమైన సహాయమును అందిస్తాయి. ఈ శ్రేణిలో, మూడు సెట్లుగా ఏడు పుస్తకములు ఉన్నాయి. ఈ శ్రేణిలోనున్న విషయాలు పురోగమనములో మరియు ప్రతి ఒక్కరికీ అద్భుతమైన సరఫరాగా ఉండును.

అధికముగా నేర్చుకొనండి

ఇతరులతో పంచుకొనండి