మా పుస్తకాల పట్ల మీకున్న ఆసక్తికి ధన్యవాదములు. కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి వలన, మేము పుస్తకాలను రవాణా చేయుటను నిలిపివేయవలసి వచ్చెను, గనుక ఈ సమయములో మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మా వద్ద ఇబుక్స్ (eBooks) మాత్రమే లభించును. మీరు ఇబుక్స్ (eBooks) డౌన్లోడ్ చేసుకున్నాగాని, మీకింకను మేము పంపగలిగినప్పుడు ముద్రించబడిన పుస్తకాలను పొందుకోవాలని ఉంటే, లేక ముద్రించబడిన పుస్తకాలను ఆర్డరు చేయుటకు అవి అందుబాటులోనికి వచ్చేవరకు వేచియుండాలని ఉంటే, దయచేసి కొన్ని నెలల తర్వాత మా వెబ్‌సైట్‌ను మరలా చెక్ చేయండి.

దేవుని గూర్చిన, మానవుని గూర్చిన, ఈ భూమిపై ఏమి జరుగుతుంది అనేదానిని గూర్చిన ప్రశ్నలు

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న మహమ్మారి గల ఈ దినాలలో ఆత్మసంబంధమైన వ్వవహారాలను గూర్చియు మరియు దేవుడు ఏమి చేస్తున్నాడు? నేను ఏమి చేయాలి? ఈ సంగతులు ఎందుకు జరుగుచున్నవి? భవిష్యత్తులో ఏమి సంభవించును? మున్నగు ప్రశ్నలను గూర్చియు బైబిలు నుండి కొంత అంతర్‌దృష్టిని (insights) మేము మీతో ఈ క్రింద పంచుకొనగోరుచున్నాము. ఇంతకు మునుపెన్నడూ లేని ఈ పరిస్థితి నడుమ మీరు, మీకు ప్రియమైనవారు ఎలా ఉండాలో తెలుసుకొనుటకు ఇవి మీకు సహాయకరంగా ఉంటాయని ఆశిస్తున్నాము.

వ్యాసములు

సమాధానము మరియు భద్రత

మనకు సమాధానమును భద్రతను ఇచ్చుటకు మానవ సమాజము ఉద్దేశించబడినది. సమాధానము, భద్రత లేకుండా మన జీవితములు భయములోను సంశయములోను గడచిపోవును. మన ప్రభుత్వము మనకు క్షేమమును చేకూర్చుటకు వాగ్దానము చేసెను; మన ఆసుపత్రులు, వైద్యశాలలు మన ఆరోగ్యము, శారీరకమైన శ్రేయస్సు కొరకు ప్రయత్నించుచుండగా, మన బ్యాంకులు మరియు ఇతర ఆర్ధిక సంస్థలు మన పొదుపులకును పెట్టుబడులకును భద్రతను వాగ్దానము చేసెను. అయితే తుదకు, మన ప్రభుత్వము, మన ఆర్ధిక సంస్థలు, మన ఆరోగ్య భద్రతా వ్యవస్థ, మరియు మనము ఆధారపడుతున్న ఇతరమైనవి అనేకము, వాగ్దానము చేసినట్టి భద్రతను ఎంతమేరకు నిజముగా మనము పొందుచున్నాము?


ఇతరులతో పంచుకొనండి