సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును (శాంతి) నేనెలా కలిగియుండగలను?

సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును (శాంతి) నేనెలా కలిగియుండగలను?

సమాధానమును (శాంతి) కలిగియుండుటకు గల ఒకే ఒక మార్గము మన బాహ్యమైన పరిస్థితులను నియంత్రించుటయేనని మనలో చాలామంది భావిస్తారు. అయితే, వాస్తవంగా మనము పరిస్థితుల చేత నియంత్రించబడతాము. బాహ్య వాతావరణము శాంతియుతంగా మారుతుందని మనము నిరీక్షించవచ్చు, కానీ బదులుగా, మన జీవితము సమాధానమును (శాంతిని) కనుగొను, కాపాడుకొను నిరంతర ప్రయత్నముతో నిండుకొనియున్నది. మరొకవైపు, బైబిలు పూర్తి భిన్నమైన జీవనమును గూర్చి బయలుపరచుచున్నది; ఈ జీవనము ఉన్నతమైన, లోతైన, ఎప్పటికీ నిలిచియుండే, మన పరిస్థితులకు సంబంధము లేని అధిగమించే సమాధానమును తెచ్చునదైయున్నది.

అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ఫిలిప్పీయులకు 4:7

మొదటిగా, మానవ సమాధానము(శాంతి)  కంటే అధికమైన దానిని మనము చూశాము - అదేమనగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న దేవుని సమాధానము(శాంతి)! మానవుడు ఉత్పత్తి చేయు సమాధానము(శాంతి) పరిమితమైనది, అయితే దేవుని సమాధానము (శాంతి) అపరిమితమైనది మరియు మన జ్ఞానమునకు మరియు అనుభూతులకు మించినది. మనము గందరగోళముతో కూడిన, ఒత్తిడితో కూడిన బాహ్యమైన పరిస్థితుల గుండా ప్రయాణించుచున్నప్పటికీ, దేవుని సమాధానము ద్వారా ఇంకనూ సమాధానముతో కూడిన ఆంతర్యపు స్పృహను కలిగియుండగలము. ఈ సమాధానము మన హృదయములకు  మరియు తలంపులకు కాపలా కాయగాలుగును. దేవుని సమాధానమును కలిగియున్నప్పుడు మనము నిరుత్సాహము చెందము, క్షీణించము, లేక చింతించము. 

శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. యోహాను 14:27

ఒక క్రైస్తవుడు బలహీనుడుగా ఉన్నప్పటికీ బలవంతుడుగా ఉండగలడు; అతడు బాధను అనుభవించుచున్నను సమాధానపు (శాంతి) స్పృహను కలిగియుండగలడు. అతడు బాహ్యముగానున్న శ్రమలను బట్టి బాధను కలిగియుండును; అతడు ప్రభువును కలుసుకొనుట ద్వారా మరియు అంతరంగమందు ప్రభువును తాకుట ద్వారా సమాధానపు(శాంతి) స్పృహను కలిగియుండును.
జీవమును గూర్చిన జ్ఞానము, పేజీ. 61*

రెండవదిగా, బైబిలు నందు మనము ఏవిధముగా శాంతిని (సమాధానము) అనుభవించగలమో చెప్పబడింది. దేవుడు మనకు శాంతిని(సమాధానము) ఒక వస్తువుగా ఇవ్వలేదు, గానీ దానికి బదులుగా ఆయన ఒక వ్యక్తిని ఇచ్చెను - ఆయన స్వయానా క్రీస్తునే శాంతిగా(సమాధానం) ఇచ్చెను. శాంతిని (సమాధానం) స్వీకరించుటకు గాను అంతరంగమందున్న క్రీస్తును మనము తాకవలసిన అవసరమున్నది. ఈ సమాధానమును గూర్చిన అనుభవము మన మానవాత్మయందు ప్రారంభమగును. దేవుడు మానవుని ఒక ఆత్మతో సృజించెను, కానీ మానవ పతనము ద్వారా, మన ఆత్మ చనిపోయెను మరియు పనిచేయుట ఆగిపోయెను.  దేవుని సమాధానమును కలిగియుండుటకు కావలసిన ప్రాధాన్య అవసరత మొదటిగా మనము బ్రతికించబడిన ఆత్మను కలిగియుండవలెను.

6 వ వచనములో [రోమా 8వ అధ్యాయము] “ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునైయున్నది” అని అపోస్తలుడు చెప్పాడు. ఆత్మపై మనస్సును ఉంచడం వల్ల వచ్చు ఫలితము జీవము మాత్రమే కాదు గాని సమాధానము కూడా అయ్యున్నది. కాబట్టి ఆత్మ ఫలము జీవమే గాక సమాధానము కూడా అయ్యున్నది. మనము ఆత్మను తాకినప్పుడు జీవమునే గాక సమాధానమును కూడా తాకుతాము.
జీవమును గూర్చిన జ్ఞానము, పేజీ. 70*

మూడవదిగా, మన మనస్సు మన ప్రాణములో ప్రాముఖ్యమైన భాగమైయున్నది - కాబట్టి మన మనస్సు ఎక్కడ ఉంచబడుతుందో, మన వ్యక్తిత్వమంతయు వెంబడించును. ఒకవేళ మన మనస్సు మన చుట్టూజరిగే సంఘటనలపై ఉంచబడినట్లయితే, మనము దేవుని సమాధానమును అనుభవించలేము. మనము సజీవముగా, సమాధానకరముగా ఉండుటకు బదులుగా ఆంతర్యమందు చనిపోవుదుము. మన ఆత్మ మీద మన మనస్సుంచుటను మనము తప్పక నేర్చుకోవాలి.

మనము దేవునిని మనయందు తగినంతగా సంపాదించుకొని దేవునిని, దేవుని జీవమును సరిపడినంతగా అనుభవించినచో, మనము మన యందు తగినంత సమాధానమును కలిగియుందుము. ఈ సమాధానమనునది బాహ్యపు వాతావారణమందున్న సమాధానము కాదు గాని, మన యందున్న సమాధాన స్థితియైయున్నది.
జీవమును గూర్చిన జ్ఞానము, పేజీ. 57*

నాల్గవదిగా, మనము దేవుని అనుభవించుట, దేవుని జీవము, మరియు సమాధానము అనేవి కలిసి వెళ్ళును. దేవుని సంపాదించుకొను అనుభవము సమాధానము నందు ఫలితమిస్తుంది. ఈ అంతరంగ సమాధానము బాహ్యపు వాతావరణము నందు మనము కనుగొనగలిగిన ఎటువంటి సమాధానము కంటెను లోతైనదిగా ఉండును.

మీరు గనుక సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము కొరకు ఎదురుచూస్తున్నట్లయితే మరియు సమాధానకర్తయగు దేవుని మీరు ఇంకా స్వీకరించనట్లయితే, తెరువబడిన హృదయముతో ఆయనకు ఇలా చెప్పుము :

“ప్రభువైన యేసు, నీవు నాకు కావాలి. ప్రభువా, నీ యందు నేను విశ్వసిస్తున్నాను. నా లోనికి రమ్ము! నీ జీవాన్ని నాకు ఇప్పుడే ఇవ్వుము. నీ సమాధానముతో నన్ను నింపుము. ప్రభువా, నా జీవముగా, నా నిజమైన భద్రతగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రభువా.”

*All quotes and verses Copyright © by Living Stream Ministry. Verses taken from "The New Testament Recovery Version Online" at https://online.recoveryversion.bible


ఇతరులతో పంచుకొనండి