ఈ ప్రపంచం ఎప్పుడు అంతమగును?

ఈ ప్రపంచం ఎప్పుడు అంతమగును?

ప్రపంచ వ్యాప్తమైన అంటువ్యాధి, భూకంపం, పెనుతుఫాను/ప్రచండ పవనము, వరద మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రపంచం ఎప్పుడు అంతమగునోయని ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. ఇది విస్మరించలేని తీవ్రమైన ప్రశ్న. కొందరు చనిపోవుటకు భయపడుతున్నందున ఈ ప్రశ్నను అడిగెదరు. మరికొందరు తీర్పు దినమునకు భయపడుతుండగా, మరికొందరు మనం ఉంటున్న ఈ భయానకమైన గందరగోళపు స్థితిని దేవుడు త్వరగా అంతం చేయాలని మరియు మానవుడు శాంతి సమాధానములతో  జీవించుటకు ఆయన తన  ప్రేమ మరియు నీతి గల రాజ్యమును తీసుకు వచ్చునని ఆశిస్తున్నారు.

ఈ ప్రశ్నకు సమాధానమిచ్చుటకు అర్హుడైన ఏకైక అధికారియైన దేవుడు తన నమ్మకమైన ప్రవక్తల ద్వారా మాట్లాడెను, మరియు ఆయన మాట్లాడినవి వ్రాసిపెట్టి బైబిలు అనే ఒక పుస్తకంలో సంకలనం చేయబడెను (మత్తయి 24:36). ఇక్కడ మనం ఈ ప్రశ్నకు బైబిలు ప్రకారం సమాధానం ఇస్తాము మరియు ప్రస్తుత ప్రపంచం ఎలా అంతమగుతుందో చూస్తాము.

సృష్టిలో దేవుని ఉద్దేశ్యము

ఈ ప్రపంచము ఎప్పుడు అంతమగుతుందో తెలుసుకొనుటకు ముందు దేవుడు భూమ్యాకాశములను ఎందుకు సృష్టించెనో మనము తప్పక అర్థము చేసుకోవాలి. ఆయన స్వరూపములో సృజింపబడి, జీవముగానున్న ఆయనతోనే నింపబడి, ఆయనను వ్యక్తపరచుటకు మరియు ఈ భూమియంతటిపై ఆయన కొరకు ఏలుబడి చేయుటకు ఒక సమిష్టి మానవునిగా నిర్మించబడిన ఒక గుంపు ప్రజలను దేవుడు కలిగియుండుటే ఈ సృష్టిని చేయుటలో దేవునికున్న ఉద్దేశ్యము (ఆదికాండము 1 26). ఈ సమిష్టి  మానవుడు నిర్మించబడకుండా ప్రపంచం అంతం కాదని ఇది మనకు చూపుచున్నది (ఎఫెసీయులు 4:12). దేవుడు ఇప్పటికీ ఈ కళాఖండంపై పని చేస్తూనే ఉన్నాడు మరియు నీవును దానిలో ఒక భాగం కావచ్చును (ఎఫెసీయులకు 2:10).

భూమి ఉపయోగించబడుట

ఈ విశ్వం నమ్మలేనంత పురాతనమైనది. ప్రస్తుతమున్న ఒక అంచనా ప్రకారం, విశ్వం సుమారు 13.8 బిలియను సంవత్సరాల క్రితం సృష్టించబడెను. దేవుడు మానవుని సృష్టించినప్పటి నుండి, మానవుడు భూమి యొక్క వనరులను ఉపయోగిస్తూనే ఉన్నాడు. గత శతాబ్దంలో, ఈ వనరులను మానవుడు  వినియోగించుకొనుట గణనీయంగా పెరిగింది, అది ఎంతగా అంటే, అవి బహు త్వరగా గతించుపోచున్నంతగా పెరిగింది. ప్రస్తుతపు నిష్పత్తిలోనే వినియోగం ఇక ముందును కొనసాగితే, మనకు అవసరమైన చమురు నిల్వలు వచ్చే శతాబ్దం వరకు కూడ ఉండకపోవచ్చు. ఓజోన్ పొరలో ఉన్న రంధ్రాలు చర్మ క్యాన్సరు సంభావ్యతను ఊహించని విధముగా పెంచుతాయి. వాతావరణంలో హరితగృహ వాయువులు (Greenhouse gases) పెరుగుతున్నాయి, కాబట్టి భూగోళం వేడెక్కిపోతుంది మరియు అధికమైన కరువులు, మంటలు మరియు వరదలతో వాతావరణ నమూనాలు మారుతున్నాయి.  పెనుతుఫాను/ ప్రచండ పవనము, వరదల వంటి  తీవ్రమైన వాతావరణ సంఘటనలు చాలా తరచుగా మరియు తీవ్రంగా సంభవిస్తున్నాయి. అడవులు క్షీణించిపోచున్నాయి; వన్యప్రాణులకు తక్కువ ఆవాసాలు మరియు ప్రాణవాయువు  ఉత్పత్తి చేయబడుటకు  తక్కువ వృక్షాలు ఉంటున్నాయి. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి మరియు వందల మిలియన్ల ప్రజలు నివసించే తీరప్రాంతాలను అవి కప్పివేస్తున్నాయి. జలాశయపు మట్టములు తగ్గుతూ అవసరమైన ప్రాంతాలలో మంచినీటి కొరతను అధికముగా పెంచుతున్నాయి. రసాయన మరియు అణు వ్యర్ధాలు మనం త్రాగే మంచినీటి సరఫరాలోకి మరియు సముద్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రతి సెకను గాలి కలుషితమవుతూ, అనేక పట్టణ ప్రాంతాల్లో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలను తీసుకు వస్తుంది. ప్రపంచ జనాభా విపరీతంగా పెరుగుచున్నది. మన జీవితకాలంలో లేదా మన పిల్లల జీవితకాలంలో మనుగడకు అవసరమైన ఆహారం మరియు ఇతర నిత్యావసరాల సరఫరా అనేది డిమాండ్‌ను మించి ఉండవచ్చును. పెద్ద అణుసంబంధమైన  ఘర్షణ లేకున్నప్పటికీ, 30 నుండి 50 సంవత్సరాలలో భూమి నేడు మనమిప్పుడు నివసించే గ్రహం వలె ఉండదు. ఒకానొకదినమున ఈ భూమి యొక్క ఉపయోగం ముగిసిపోవునని, మరియు  కాల్చివేయబడుటకు అది పాత వస్త్రం వలె చుట్టబడుతుందని బైబిలు చెబుచున్నది (హెబ్రీయులు 1: 10-12; 2 పేతురు 3:12).

ప్రపంచ అంతమునకు దారితీయు దినములు

ప్రపంచం ఎప్పుడు అంతమగునో బైబిలు చెప్పుటలేదు. ఆ దినమైనను గడియయైనను మనకు తెలియదు( మత్తయి 25:13), కానీ ప్రపంచ అంతమునకు దారితీసే దినములు ఎలా ఉంటాయో ఇది మనకు తెలియజేస్తుంది. చివరి దినములలో యుద్ధములు, యుద్ధ సమాచారములను గూర్చిన పుకారులు, కరువులు మరియు భూకంపాలు ఉంటాయి ( మత్తయి 24: 6-7). చివరి దినములలో అన్యాయము విస్తరించును ( మత్తయి 24:12). చాలా మందికి దేవుని పట్ల మరియు ఇతర వ్యక్తుల పట్ల ప్రేమ చల్లారును ( మత్తయి 24:12).  జీవితం చాలా ఆందోళనలతో నిండి ఉండును, ఈ కారణంగా ప్రజలు ఆందోళనల నుండి తప్పించుకొనుటకై అన్ని విధాలుగాను జారత్వము మరియు త్రాగుడులలో ఎక్కువగా పాల్గొంటారు (లూకా 21:34). ప్రపంచము యొక్క ముగింపు వరకు ఉండే నాలుగు గుర్రాల పందెము యొక్క ఉదాహరణను కూడా బైబిలు ఇస్తుంది (ప్రక. 6:1-8). ఈ నాలుగు గుర్రాలు ఏవనగా సువార్త, యుద్ధం, కరువు, మరణము.  ఈ పందెము కొనసాగును, ఇంకనూ ఉధృతమగును. ఈ అంశాలు ఏవీ పోవు, మరియు విషయాలు మెరుగుపడతాయని మనము ఆశించే కొలదీ, అవి మెరుగుపడవు గానీ, అవి ఇంకా అధ్వాన్నంగా తయారగును.

ప్రపంచము అంతమయ్యే విధానము

అయితే, ప్రపంచం ఎలా అంతమగునో బైబిలు చెబుచున్నది. ఇక్కడ ముఖ్యాంశాలు కలవు. ప్రపంచ అంతము యొక్క చివరి ఏడు సంవత్సరాలు, మూడున్నర సంవత్సరాల చొప్పున రెండు విభాగాలుగా విభజించబడును. మొదటి మూడున్నర సంవత్సరాలు ప్రశాంతంగా ఉండును. ఆ సమయము యొక్క ముగింపులో, జీవముగానున్న ఆయనతో పూర్తిగా నిండిన సమిష్టి మానవుణ్ణి ఉత్పత్తిచేయు పనిని దేవుడు సంపూర్ణము చేయును (ప్రకటన 12: 5).  వీరు జయించువారై ఉన్నారు. అప్పుడాయన వారిని పరలోకమునకు తీసుకువెళ్ళును. వారు అక్కడ సాతానును, అనగా అపవాదిని ఓడించి వాడిని భూమిపై పడవేయుదురు (ప్రకటన 12: 9-11; 14: 1). అప్పుడు అపవిత్రాత్మ క్రీస్తువిరోధి అని పిలువబడు దుష్టమైన మానవునిలోనికి ప్రవేశించును, మరియు సాతానుడు వానికి తన శక్తిని ఇచ్చును (ప్రకటన 13: 2). ఇది ప్రపంచము యొక్క చివరి మూడున్నర సంవత్సరాలలో ప్రారంభమగును. బైబిలు ఈ కాలాన్ని మహాశ్రమల కాలము అని పిలుస్తుంది (మత్తయి 24:11). ఆ సమయంలో భూమి ఎవరికీ నివాసయోగ్యమైన ప్రదేశముగా ఉండదు (ప్రకటన 3:10). క్రీస్తువిరోధి మానవాళికి చాలా నష్టం చేయును, అదే సమయంలో, అనేక ప్రకృతి సంబంధమైన మరియు అసాధారణమైన విపత్తులు సంభవించును (ప్రకటన 11:13). చివరి మూడున్నర సంవత్సరాల ముగింపులో, హార్‌మెగిద్దోను అను ప్రదేశమునొద్ద క్రీస్తువిరోధిని మరియు అతని సైన్యమును అణచివేయుటకు క్రీస్తు మరియు ఆయనకు చెందిన జయించువారు పరలోకమునుండి క్రిందికి దిగి వచ్చెదరు (ప్రకటన 16:16; 19: 13-16; 17:14). అప్పుడు దేవుని రాజ్యం భూమిపైకి తీసుకురాబడును, మరియు సాతాను వెయ్యి సంవత్సరాల పాటు బంధించబడును(ప్రకటన 20: 2). ఈ వెయ్యేండ్ల కాలము యొక్క ముగింపులో, సాతానుడు కొంత సమయము విడుదలనొందును. వాడు మరింత నష్టం చేయును, కాని అప్పుడు వాడు అగ్ని గుండములో పడవేయబడును (ప్రకటన 19:20; 20:10). అక్కడ సాతానుడు మరియు వాడి సహకారులందరూ నిత్యత్వమంతా తీర్పుతీర్చబడుదురు. కానీ దేవుని వైపు తిరిగి మరియు దేవునితో నింపబడుటకు తెరచుకొనియున్న ప్రజలు దేవునిలో మరియు దేవునితో ఈ నూతనపరచబడిన భూమిపై నిత్యత్వమంతా జీవించెదరు (ప్రకటన 11:15). అక్కడ ఆనందం, సమాధానము మరియు నీతి ఉండును (ప్రకటన 22: 3,5). ఇక ఎలాంటి కన్నీళ్లు, కొరత, అనారోగ్యం, దొంగతనం, అన్యాయం లేదా మరణం అక్కడ ఉండవు (ప్రకటన 21: 3-4).

మహాశ్రమల కాలములో, ఈ ప్రపంచము యొక్క అంతములో వచ్చు నిస్సహాయస్థితి నుండి నీవు తప్పించుకోవాలంటే, నేడే నీవు దేవుని ఎదుట పశ్చాత్తాపపడవలెను మరియు ఆయనను, ఆయన రక్షణను స్వీకరించవలెను(మత్తయి 4:17; ఎఫెసీయులు 5: 18-19; యోహాను 10:10). మీరు సాతానుని నాశనము నుండి మరియు దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలనుకుంటే, ఈ క్రింది విధంగా ప్రార్థించమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము:

"ఓ యేసు ప్రభువా! నన్ను సాతాను రాజ్యము నుండి దేవుని రాజ్యములోనికి బదిలీ చేయుము. నేను నీలో మరియు నీతో నిత్యత్వమంతా జీవించగోరుచున్నాను. నా జీవముగా ఉండుటకు నాలోనికి రమ్ము. నీ రక్షణలోనికి ప్రవేశించునట్లు నాకిప్పుడు నీవు అవసరమైయున్నావు”

దేవుని గూర్చి మరియు మానవజాతి కొరకైన ఆయన ప్రణాళిక గురించి మరింత చదవడానికి, దయచేసి మా వెబ్‌సైట్‌ను ఇక్కడ సందర్శించండి: https://www.rhemabooks.org/te/articles/questions-about-god-man-and-what-is-happening-on-the-earth/


ఇతరులతో పంచుకొనండి