విచారము మరియు బాధ నుండి విడిపింపబడుటకు ప్రభువు నామమును పిలుచుట

విచారము మరియు బాధ నుండి విడిపింపబడుటకు ప్రభువు నామమును పిలుచుట

విచారము మరియు బాధతో కూడిన పరిస్థితులలో, ప్రజలు తరచుగా కలవరపడతారు లేక ఏవిధముగా ప్రతిస్పందించాలి అనే అస్పష్టతను కలిగియుంటారు, ఇటువంటి సమయాలలో చాలామంది ప్రార్ధిస్తారు, అయితే మనము దేని కొరకు ప్రార్ధిస్తాము, మరియు ఎలా ప్రార్ధిస్తాము? బైబిలులో రికార్డు చేయబడిన ఒక అతిప్రాముఖ్యమైన సులభతరమైన సహాయ మార్గము ప్రభువు నామమును పిలచుటయైయున్నది (రోమా. 10:13). పిలుచుట అనేది ఒక నిర్దిష్టరకమైన ప్రార్ధన; ఇది కేవలము ఒక అభ్యర్ధన లేక సంభాషణ మాత్రమే కాదు గాని మనలను జీవింపజేయు మరియు ఆత్మసంబంధమైన బలమును కొనసాగింపజేయు ఆత్మసంబంధమైన శ్వాస యొక్క సాధనయై యున్నది.   

“యెహోవా, అగాధమైన బందీగృహములోనుండి నేను నీ నామమునుబట్టి మొరలిడగా (పిలువగా) నీవు నా శబ్దము ఆలకించితివి సహాయముకొరకు నేను మొఱ్ఱపెట్టగా చెవిని మూసికొనకుము.” విలాపవాక్యములు. 3:55-56

పైనున్న వచనములలో, యిర్మియా ప్రభువు (యెహోవా) నామమును పిలుచుట అనగా ఆయనను బిగ్గరగా పిలుచుట మరియు ఆత్మసంబంధమైన వాయువును పీల్చుకొనుట అయ్యున్నది. ఈ విధముగా ప్రభువు నామమును పిలుచుట మన ఆంతర్యమందున్న విచారము నుండి మరియు బాధ నుండి వెంటనే విడిపించును. 

కీర్తనలు 118:5 లో కీర్తనాకారుడు “ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని(పిలచితిని) విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను.” అని సాక్ష్యమిచ్చెను. మరియు కీర్తనలు 50:15 లో కూడా “ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము (పిలువుము) నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు.” అని చదువుతాము. ఈ వచనములు విచారము మరియు బాధనుండి విడిపింపబడుటను అనుభవించుటకు ప్రభువు నామమును పిలుచుట ఒక మార్గముగా ఉన్నదని నొక్కిచెప్పుచున్నవి.     

“ప్రభువు నామమును పిలుచుటకు గల మరొక కారణమేమనగా శ్రమలలో నుండి (కీర్తనలు. 18:6; 118:5) సమస్యలలో నుండి (కీర్తనలు. 50:15; 86:7; 81:7), విచారము మరియు బాధనుండి (కీర్తనలు. 116:4) విడిపింపబడుట కొరకు. ప్రభువును పిలుచుటను వ్యతిరేకించి, వాదించేవారు, సమస్యలు లేదా రోగాలు వచ్చినప్పుడు ఆయనను పిలుచుటను తమంతట తామే కనుగొనిరి. మన జీవితములో సమస్యలు లేనప్పుడు, మనము ప్రభువును పిలుచుటను గూర్చి వ్యతిరేకించి వాదించేవారిమిగా ఉండవచ్చును. అయితే, సమస్యలు వచ్చినప్పుడు, ఆయనను పిలువమని మనకు ఎవరునూ చెప్పనవసరము లేదు; మనము అప్రయత్నముగానే ఆయనను పిలిచెదము.”
క్రైస్తవ జీవితము యొక్క ప్రాధమికమైన విషయాలు, సంపుటి 1, పేజీ.33 *

ప్రభువు నామమును పిలుచుటనే ఆచరణ క్రొత్తది కాదు. దీనిని మనము బైబిలంతటిలో కనుగొనగలము (ఆది. 4:26, ఆది. 12:8, అపో.కార్య 22:16, 2 తిమోతి. 2:22). అయితే ఈ ఆచరణ వందల సంవత్సరాల తరబడి కోల్పోబడెను మరియు కొంతమంది చేత అపార్ధము చేసుకొనబడెను. అపోస్తలులకార్యములు గ్రంధములో, ప్రభువు నామమును పిలుచుటనే ఆచరణ చేత వారిని సులభముగా గుర్తించునంతగా ఆదిమ క్రైస్తవుల మధ్య ఇది చాలా సర్వసాధారణమైన విషయముగా ఉండెను (అపో.కార్య 9:14, 21). మనము విచారకరమైన లేక బాధాకరమైన సమయముల గుండా ప్రయాణించినా లేకపోయినా, ప్రతి పరిస్థితి యందు మరియు ప్రతి స్థలమందున ప్రభువు నామమును పిలుచుటను మనము అభ్యసించవచ్చును.         

అపో.కార్య 2:21 ఇలా చెప్పుచున్నది, “అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు (పిలుచు) వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు.”

మీరు ఇప్పుడే రక్షించబడాలంటే, ప్రభువైన యేసు నామమును పిలువుము మరియు ఆయనతో ఇలాగు చెప్పుము:

“ఓ యేసు ప్రభువా!ఓ యేసు ప్రభువా!ఓ యేసు ప్రభువా! నీ నామమును నేను పిలుచుటను సులభతరము చేసినందుకు నీకు ధన్యవాదములు. నా స్వరాన్ని వింటున్నందుకు నీకు వందనములు. రమ్ము, నన్ను రక్షించుము. నేను నీకు ప్రవేశాన్ని ఇస్తున్నాను, నీ నామాన్ని పిలుస్తున్నాను, ఓ యేసు ప్రభువా! నిన్ను ప్రేమిస్తున్నాను.

ఇంతేకాకుండా, రోమా 10:12 లో యేసు అందరికీ ప్రభువని మరియు ఆయన నామమును పిలుచువారందరికీ ఆయన ఐశ్వర్యవంతుడనియు మనము చూడగలము. ప్రభువు నామమను పిలుచుట ద్వారా ఆయన ఎంత ఐశ్వర్యవంతుడైయున్నాడో నిరంతరము మనము అనుభవించగలము. మన భౌతికమైన శ్వాసించుట ఎలాగున్నదో, ప్రతి పరిస్థితియండు మరియు ప్రతి స్థలమందున ఐశ్వర్యవంతమైన మన దేవుని అనుభవించుటకుగాను పిలుచుట మార్గమైయున్నది.

ప్రభువు నామమును గూర్చి మరింతగా క్రైస్తవ జీవితము యొక్క ప్రాధమికమైన విషయాలు, సంపుటి 1. నందు “ప్రభువు నామమును పిలుచుట” అను శీర్షిక కలిగిన అధ్యాయమును చదువగలరు. మీ ఉచిత ప్రతి కొరకు అభ్యర్ధించగలరు.    

*All quotes © by Living Stream Ministry. Verses taken from "The New Testament Recovery Version Online" at https://online.recoveryversion.bible


ఇతరులతో పంచుకొనండి