విజయవంతమైన క్రైస్తవ జీవితమును జీవించుటకు నీకు అవసరమైన 7 అనుభవములు

విజయవంతమైన క్రైస్తవ జీవితమును జీవించుటకు నీకు అవసరమైన 7 అనుభవములు

మా ఉచిత క్రైస్తవ పుస్తక సరణిలో కనుగొను విజయవంతమైన క్రైస్తవ జీవితమును జీవించుటకొరకు మనకు సహాయము చేయడానికి అవసరమైన 7 అనుభవములు. ఇక్కడ ఇవ్వబడిన అంశములు సమగ్రమైనవిగా లేనప్పటికీ మనము ప్రవేశించగలిగిన కొన్ని తాళపుచెవివంటి క్రైస్తవ అనుభవములను గూర్చి చూపుచున్నవి. క్రీస్తు సిలువపై సాతానుని జయించెను మరియు క్రీస్తుని విజయమును కొనసాగించుటయే మనము విజయశీలురుగా ఉండుటకు మార్గమైయున్నది. మా యొక్క వరుస పుస్తకముల శ్రేణి మన దైనందిన జీవితములో క్రీస్తుని విజయమును కొనసాగించుటకు సహాయము చేయు అనేక అంశములను కలిగియున్నవి.

  1. మనము దేవుని ఉద్దేశమును ఎరుగవలసిన మరియు దాని ప్రకారము జీవించవలసిన అవసరమున్నది అప్పుడు మనము విజయవంతులముగా ఉన్నామనే అనుభూతిని కలిగియుంటాము. మా వరుస పుస్తకములు బైబిలులో ఉన్న దేవుని ఉద్దేశమును, తన ఉద్దేశము ప్రకారము మనము జీవించగలుగు ఆచరణీయమైన మార్గములను బయలుపరచును.
  2. మనము క్రీస్తుని ప్రశస్తమైన రక్తము చేత జయిస్తాము. ఈ విషయము మా వరుస పుస్తకములన్నింటిలో చెప్పబడింది, మొదటిగా క్రైస్తవ జీవితము యొక్క ప్రాధమికమైన విషయములు ఒకటవ సంపుటి యందు (Vol. 1 ) “క్రీస్తు యొక్క ప్రశస్తమైన రక్తము” అను మూడవ అధ్యాయములో చెప్పబడింది, తరువాత సర్వము ఇమిడియున్న క్రీస్తు, మరియు చివరిగా మహిమగల సంఘము అను పుస్తకములలో చెప్పబడింది.

    మరియు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వానిని జయించియున్నారు... ప్రకటన . 12:11a

  1. మనకు సంపూర్ణ విశ్వాసముండుటకు తప్పక క్రీస్తును గూర్చి లోతుగా ఎరుగవలెను మరియు అనుభవించవలెను.

    మనము యెహోషువా, కాలేబుల మాదిరిని అనుకరిద్దాము. వారు విశ్వాసముతో నిండిన హృదయములను కలిగియుండిరి. వారు ప్రజలకిట్లు చెప్పగలిగియుండిరి “మనము నిశ్చయముగా వెళ్ళుదుము; దానిని స్వాధీనపర్చుకొందుము, దానిని జయించుటకు మన శక్తి చాలుననెను” (సంఖ్యా. 13:30) - సర్వము ఇమిడియున్న క్రీస్తు, 13వ అధ్యాయము.

  1. విజయవంతమైన జీవితము అనేది పునర్జన్మించినప్పుడు మనము పొందుకొనిన వాటిపై ఆధారపడి ఉంటుంది. పునర్జన్మించుట ద్వారా, ఎదుగుట, పరిపక్వత చెందుట చేత మనము జీవించవలసిన విజయవంతమైన జీవితమును జీవించుట కవసరమైన సమస్తమును మనము కలిగియుంటాము.

    పునర్జన్మద్వారా మనం నూతన హృదయాన్ని, నూతనమైన ఆత్మను పొందుకొన్నాము. పరిశుద్దాత్ముని, క్రీస్తుని, సాక్ష్యాత్తూ దేవునిని కూడా పొందుకొన్నాము. ఇవి నిజంగా మనకు సరిపోతాయి – మనం పరిశుద్ధంగా, ఆత్మీయంగా ఉండడానికి సరిపోతాయి, విజయశీలులుగాను, ఉన్నతమైన వారిగాను మనల్ని తయారు చేస్తాయి, జీవంలో ఎదిగి, పరిపక్వత చెందడానికి సరిపోతాయి. - జీవమును గూర్చిన జ్ఞానము, 4వ అధ్యాయము.  

  1. మనము జయజీవితమును జీవించుటకు  మన ఆత్మవైపుకు ఏ విధంగా తిరగవలెనో మనము  నేర్చుకొనవలెను.

    నీవు ఒక క్లిష్టమైన పరిస్థితిని సహించలేకయున్నప్పుడు మరియు ఒత్తిడి నీ శక్తికి మించి ఉన్నప్పుడు, నీ ఆత్మ వైపుకు తిరిగి యేసువైపు చూడుము. నీవు దానికంటే ఎంతో ఉత్కృష్టమైన ఎత్తుకు ఎగసి, విజయవంతుడవగుదువు. సమస్తము నీ పాదము క్రింద ఉండును. – దేవుని ప్రణాళిక, 11వ అధ్యాయము.                                                                                                                                                                                      

  1. మన ఆత్మపై మన మనస్సును పెట్టుటను మనము జ్ఞాపకముంచుకొనవలెను, ఇదియే విజయవంతమైన క్రైస్తవ జీవితమును జీవించుటకు ఆచరణీయమైన మార్గము. మన మనస్సు మన ప్రాణము యొక్క నడిపించు భాగమైయున్నది మరియు మన జీవనమును నడిపిస్తున్నది- మన మనస్సును మనము ఎక్కడ పెడాతామో అనునది మన జీవనమును నిర్ణయిస్తుంది.

    శరీరానుసారమైన (శరీరముపై నిలుపబడిన) మనస్సు మరణము, ఆత్మానుసారమైన (ఆత్మపై నిలుపబడిన) మనస్సు జీవమును సమాధానమునై యున్నది. రోమా.8:6

    మనము కేవలము యోహాను 3:16ను మాత్రమే జ్ఞాపకముంచుకొని, రోమా.8:6ను మరిచినట్లయితే, మనము పేలవంగా రక్షించబడిన క్రైస్తవులమై యుందుము; మనమింకెన్నటికిని విజయవంతమైన క్రైస్తవులము కాజాలము. నిత్యజీవమును పొందుకొనుటకు యోహాను 3:16 చాలును,అయితే రోమా.8:16 ఒక విజయవంతమైన క్రైస్తవుడు ఎట్లుండవలెనో చూపించును. - దేవుని ప్రణాళిక, 17. అధ్యాయము.

  1. దేవుని ఉద్దేశంలో సంఘము యొక్క పాత్ర మరియు సంఘమును గూర్చి మనము తెలుసుకొనవలసిన అవసరమున్నది. విజయము అనేది కేవలము వైయక్తికమైన విషయము మాత్రమే కాదు;ఇది సంఘము ద్వారా చివరికి నెరవేర్చబడుతుంది,దీనిని చూచుట మనలను అనుభవములోనికి నడిపిస్తుంది.

    విజయవంతమైన  సంఘమును మరియు విజయవంతమైన క్రీస్తును కలిగియుండాలనేది ఆయన ఉద్దేశము, సాతాను యొక్క పనిని జయించిన క్రీస్తు సంఘము మరియు సాతాను యొక్క పనిని పడగొట్టిన సంఘము. - మహిమ గల సంఘము, 2వ అధ్యాయము

చివరిగా, "విశ్వాసము నందు రేపు అనేది లేదు; ఎలప్పుడు నేడు." విజయవంతమైన క్రైస్తవ జీవితము జీవించుట నేటికి  సంబంధించినది, కాబట్టి  ఈరోజు నీవు ఏమి చేయగోరుచున్నావు? ఒకటి తరువాత ఒకటి ఉన్న పుస్తకములను చదువుట ప్రారంభించాలని మేము మిమ్మును  అభ్యర్థిస్తున్నాము. https://www.rhemabooks.org/te/order-free-books/


ఇతరులతో పంచుకొనండి