మీరు మా పంపిణీ కార్యక్రమాలలో ఎలా పాల్గొనగలరో తెలుసుకోండి

మీరు పాల్గొనేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిగా మీ ప్రార్థన ద్వారా; రెండవదిగా విరాళం ద్వారా; మూడవదిగా , మీ ప్రాంతంలో ఉచిత సాహిత్య పంపిణీలో పాల్గొనడం ద్వారా

ప్రార్థన ద్వారా పాల్గొనవచ్చును

వారి ప్రాంతంలోనూ మరియు ప్రపంచమంతటా ఈ పంపిణీలో పాలొందాలనే ఆశను అనేక మంది వ్యక్తపర్చారు. మరింత సమాచారం కోసం ఈ విన్నపాల్ని అభినందిస్తున్నాం. ఏ విధానంలో మీరు మాతో కలవగలరో ఈ విభాగంలో తెలియజేయాల్సిందిగా ఆశిస్తున్నాం. మీరు పాలుపంచుకునేందుకు వీలుగా ఈ విభాగాన్ని మూడు భాగాలుగా విభజించాం: ప్రార్థన, విరాళాలు మరియు పంపిణీ.

ఇందులో పాలుపంచుకోవడానికి గల మొట్టమొదటి అతి ప్రాముఖ్యమైన మార్గం – ప్రార్థన. ఉచిత పుస్తకాల్ని వివిధ భాషల్లోకి మరియు దేశాల్లోకి పంపిణీ చేస్తుండగా 1తిమోతి 2వ అధ్యాయంలో ఉన్నట్టు మనుష్యుల రక్షణ కొరకైన ఒక ప్రత్యేకమైన ప్రార్థన విన్నపంతో మేము ప్రభావితం చేయబడితిమి.

మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నింటికంటే ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును క్రుతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించు చున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై యున్నది. ఆయన మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము కలవారైయుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.  1తిమోతి 2:1-4

ఇక్కడ మనం ఈ క్రింది విషయాల్ని గమనించగలం:

  • మనుషులందరి కోసం విజ్ఞాపనలు, యాచనలు, క్రుతజ్ఞతాస్తుతులు చేయడంతో సహా ఉన్న ప్రార్థన యొక్క అనేకమైన స్థాయిలు
  • ప్రార్థన మనుషులందరి కోసం నిర్దేశించబడింది. ఇందులో రాజులు, అధికారులు చేర్చబడ్డారు. మనం నేటి ప్రపంచ స్థితిని గూర్చి ఆలోచిస్తే దేవుని వాంఛ నెరవేరడానికి గల తాళపుచెవి ఇదేనని మునుపెన్నడూ లేనంత నిశ్చయంగా మనం చెప్పగలం.
  • దేవుని వాంఛ రెండింతలుగా ఉంది – మనషులందరూ రక్షింపబడుట, వారు సత్యాన్ని గూర్చిన సంపూర్ణ జ్ఞానంలోనికి వచ్చుట. ప్రార్థనలో మనం పాలుపంచుకోవడం కూడా ఈ వాంఛను ప్రతిబింబిస్తోంది.
  • ఈ ప్రార్థన చాలా ప్రత్యేకమైంది మరియు గురి కలిగి ఉంది. ఎందుకంటే ఇది నెమ్మదిగా, సుఖంగా బతకడం యొక్క అవసరాన్ని కూడా పేర్కొంటోంది. అలాంటి పరిస్థితిలో మనుషుల్ని రక్షించడానికి సత్యం యొక్క సంపూర్ణ జ్ఞానం దగ్గరికి వారిని తేవడానికి దేవునికి ఒక మార్గం ఉంటుంది.

ఇలాంటి ప్రార్థనలో దేవుని ప్రజల యొక్క ఒక గుంపు పాలుపంచుకొన్నప్పుడు కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రత్యేకమైన విషయాలన్నీ జరుగుతాయని మా సొంత అనుభవంలో మేం చూశాం. ఈ పుస్తకాలు సత్యం యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని ఉచితంగా వ్యాపింపచేయుచుండగా అనేకమంది ఈ విధంగా ప్రార్థింపగలరని మేం మనసారా ఆశిస్తున్నాం.

రీమా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వాషింగ్టన్ రాష్ట్రంలో 1982లో స్థాపించబడిన లాభాపేక్షలేని కార్పోరేషన్. రీమాకు ఇచ్చే విరాళములకు యు.ఎస్.ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ సెక్షన్ 501 (సి) (3) ప్రకారము పన్ను మినహాయింపు ఉన్నది. రీమా ఆర్థిక వనరులను పర్యవేక్షించే ఒక స్వతంత్ర కార్యనిర్వాహక వర్గం ఉన్నది. రీమాకు ప్రపంచ వ్యాప్తంగా పది దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. అవి క్రైస్తవ సాహిత్య పంపిణీలో నిమగ్నం అయ్యాయి.

విరాళములన్నీ విలువైనవిగా పరిగణించబడును మరియు బైబిళ్లను, క్రైస్తవ సాహిత్యమును పంపిణీ చేయుటకు బైబిల్లోని సత్యాల్ని అర్థం చేసుకొని అనుభవించునట్లు చదువరులకు సహాయపడే సమావేశాలు, శిక్షణ తరగతులు నిర్వహించుట వంటి అనుబంధ కార్యక్రమాలకు ఉపయోగించబడును.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి వాణిజ్య అవసరాలకు ఇవ్వబడదు లేదా ఇతర సంస్థలతో పంచుకోబడదు.

ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును; అణచి కుదిలించి దిగజారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడునని చెప్పెను.
లూకా 6:38

రీమాకు ఇచ్చుటకు ప్రభువుచే భారము పొందినవారు ఈ క్రింది విధానములలో విరాళములనివ్వగలరు.

స్వచ్చందంగా పని చేయుట ద్వారా పాల్గొనవచ్చును

కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమునిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను.
మత్తయి 28:19-20

అయినను పరిశుద్ధాత్మ మీమీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుకు మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటయును భూదిగంతముల వరకు నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను.
అపొస్తలుల కార్యములు 1:8

భూమి మీద వివిధ భాగములలో ఉచిత సాహిత్య పంపిణీలో పాలుపొందగోరువారు దయచేసి మమ్ములను సంప్రదించండి.

మమ్మల్ని సంప్రదించండి

Share with others